MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు,…
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఇవాల ఢిల్లీకి ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది.
బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉందని రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్ అన్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈరోజు నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మోదీని ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని తెలంగాణ మంత్రులు దుయ్యబడుతున్నారు.
ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.