AP Housing Scheme: గుడ్‌న్యూస్.. ఉగాది రోజున 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు..
- పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ..
- గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతరం ఆరా..
- ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు..
- సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నేర నియంత్రణ ప్రణాళిక..
- రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Housing Scheme: ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారం అయ్యేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎం లాంటి సంస్థలు ముందుకు వచ్చాయని వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. అటు కాలిబో సంస్థ ఏర్పాటు చేయదలచిన ఏఐ శాండ్ బాక్స్ వచ్చే నాలుగు నెలల్లో స్టార్టప్ ల కోసం అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఎన్విడియా సంస్థ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో భాగసామ్యం వహించేలా చూడాలని ఆయన ఆదేశించారు.
Read Also: CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
రాష్ట్రంలో ప్రతీ రైతుకూ సహకారం అందించేలా ఏఐ ఆగ్రానమిస్ట్, విద్యా బోధనకు సహకారం అందించేలా ఏఐ ట్యూటర్, ప్రాథమికంగా వైద్య సలహాలు అందించేలా ఏఐ డాక్టర్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. సీసీ టీవీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14 వేల సీసీ కెమెరాలను అనుసంధానించి నేర నియంత్రణ చేపట్టేలా చూడాలన్నారు. నేరస్థులను గుర్తించి నేరాలకు అడ్డుకట్టే వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తేవటంతో పాటు డ్రోన్ ప్లైయింగ్ ట్రాక్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకారంతో అత్యుత్తమ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏటీసీ తరహాలోనే డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను కూడా రూపొందించాలన్నారు. వాట్సప్ గవర్నెన్సు వినియోగం మరింత పెంచేలా పౌరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షకు మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, గనులు, విద్య, ఆర్ధిక, ప్రణాళిక శాఖల అధికారులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!