ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఒక కక్ష సాధింపు చర్య అని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా… ఇది ఒక దుర్మార్గపు చర్య అని ఆమె అభివర్ణించారు. లిక్కర్ స్కాం పేరిట బీజేపీ నాటకాలు ఆడుతోందని ఆమె ధ్వజమెత్తారు. మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయిని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రతి పక్షాలను వేధించేందుకు వాడుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ డ్రామాను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.
Also Read : NASA-ISRO Satellite: బెంగళూరుకు చేరిన నాసా-ఇస్రో ఉపగ్రహం
కవిత బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో క్రియాశీలంగా ఉన్నందుకే బీజేపీ కక్ష కట్టిందని ఆయన అన్నారు. నేతలు విచారణకు సహకరిస్తుంటే ఈ నోటీసులు, బెదిరింపులు అరెస్టులు దేనికని, సీబీఐ, ఈడీల విచారణ తీరు సరిగా లేదన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్న బీజేపీకి తెలంగాణ తగిన గుణపాఠం చెబుతుందని ఆమె అన్నారు. కవితకు అందరూ అండగా ఉంటారని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళ హక్కుల రక్షణకు, రిజర్వేషన్ల కై ఉద్యమిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శక పద్దతిలో విచారణ చేపట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం మానాలని ఆమె హితవు పలికారు.
Also Read : Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. అయితే.. లిక్కర్ పాలసీ వ్యవహారంలో మంగళవారం అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ సందర్భంగా కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో భారత జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో.. మార్చి 11న విచారణకు హాజరవుతానని ఈడీకి విజ్ఞప్తి పంపడంతో.. దానికి ఈడీ అంగీకరించినట్లు తెలుస్తోంది.