నేను స్పీచ్ రాసుకుని వచ్చాను కానీ.. వివేకానంద మాట్లాడితే మర్చిపోయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైరికల్ వేస్తూనే అసెంబ్లీలో జగ్గారెడ్డి ప్రసంగం మొదలు పెట్టారు. BRS ఎమ్మెల్యే వివేకానంద ఏ సమస్యలు లేవు అన్నట్టు మాట్లాడారని, నేను స్పీచ్ రాసుకుని వచ్చా కానీ.. వివేకానంద మాట్లాడిన తర్వాత మర్చిపోయా అంటూ వ్యంగాస్త్రం వేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కవిత ట్వీటర్ వేదికగా స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు.
హైదరాబాద్లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు.