ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన కవిత ఈడీ విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. కవిత తన సొంత వాహనంలో ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లే సమయంలో ఎలాగైతే చిరునవ్వుతో వెళ్లారో బయటకు కూడా అలాగే వచ్చారు కవిత. ఇదిలా ఉంటే ఇన్ని గంటలపాటు కవితను ఏం విచారించదాన్నిపై సర్వత్ర ఆసక్తినెలకొంది. అయితే.. జాయింట్ డైరెక్టర్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఎమ్మెల్సీ కవితను విచారించింది. వంద కోట్ల హవాలా డబ్బుపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read : Groom Sleeps At Wedding: పెళ్లిలో తాగి పడుకున్న వరుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
ఐటీసీ కోహినూర్ డీల్ తర్వాత హవాలాలో ఎన్నికోట్లు చేతులు మారాయి..? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో హవాలాకు సహకరించింది ఎవరు..? అని కవితను ఈడీ ఆధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అంతకుముందు ధ్వంసం చేసిన ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి.. కవిత ముందు పెట్టి ఈడీ బృందం విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే.. మరోసారి ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఈడీ కవితకు సూచించింది.
ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే ఉహాగానాలు విపరీతంగా వచ్చాయి. విచారణ అనంతరం సాఫీగా ఎమ్మెల్సీ కవిత బయటికి రావడంతో.. అరెస్ట్ వ్యవహారంకు తెరపడింది. ఈరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు సైతం హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు.
Also Read : Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం..!