ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీఆరెస్ శ్రేణుల్లో నిరసన జ్వాలలు రగిల్చాయి. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్‌లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అంతేకాకుండా.. గవర్నర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. అయితే.. గవర్నర్ అపాయింట్‌మెంట్ లేదని వారిని పోలీసులు గేటు వద్ద నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్య గొంగడి సునీత్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం..!
అయితే.. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పు లేదని, తెలంగాణలోని ఓ నానుడిని సంజయ్ చెప్పారని ఆమె అన్నారు. ఈ చిన్న విషయాన్ని బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ను తిట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు అరుణ. కేసీఆర్ కూతురు తప్పా మిగతావాళ్లు ఆడబిడ్డలు కాదా? అని అరుణ నిలదీశారు. కేవలం కవిత ఈడీ విచారణను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు అని అరుణ మండిపడ్డారు.
Also Read : Canada: భారత్ ముద్దు.. చైనా వద్దు.. డ్రాగన్ కంట్రీని ముప్పుగా భావిస్తున్న కెనడియన్లు..