Happy Birthday Kavitakka: నేడు BRS MLC కవిత పుట్టినరోజు. 1978 మార్చి 13న జన్మించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ తన అభిమానాన్ని చాటుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కవితపై తన అభిమానాన్ని ఈరోజే కాదు గతంలోకూడా ఆయన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే..
అండమాన్ నికోబార్ దీవుల్లోని బంగాళాఖాతం తీరానికి వెళ్లిన చిన్ను గౌడ్.. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లి జన్మ దిన శుభాకాంక్షలు ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై బీఆర్‌ఎస్ అంటూ సీఎం కేసీఆర్ చిత్రం.. హాపీ బర్త్‌డే కల్వకుంట్ల కవితక్క అంటూ బ్యానర్లు సముద్రంలో తేలుతూ ప్రదర్శనతో తన అభిమానాన్ని చాటుకున్నారు. వీడియోలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో కూడా 2022 మార్చి 13న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ చెందిన చిన్ను గౌడ్ అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ భూమారెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా నేలపై 18 వేల నాణాలతో 12 అడుగుల కవిత బొమ్మను పేర్చాడు ఒక వ్యక్తి. దాని కింద హ్యాపీ బర్త్ డే కవితక్క అని రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో పాటు మరో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు కల్వకుంట్లకు కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఏకంగా చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌కు ఫ్లెక్సీలు కట్టారు. కల్వకుంట్ల కవితపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు ఆమె పుట్టిన రోజు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
RRR: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. చరిత్ర సృష్టించిందన్న రాజకీయ ప్రముఖులు