మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు.
Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై…
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర…
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆయా పార్టీల కుట్రలను తిప్పికొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే యువజన కాంగ్రెస్ నేతలు కీలకం అని…
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరుగనన్నది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్…
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ…
MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు అందరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు.
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…