తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండా ఎగురవేయడం ఖాయం అని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పుర్తిగా మోసం చేశాడని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడని మండిపడ్డారు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది అని డీకే అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు విచ్చేసిన బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…. మీలో పౌరుషం చచ్చిపోయిందా? చీము నెత్తురు లేదా? ఆనాడు మీ బిడ్డ పెళ్లినాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా మిమ్ముల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించిందన్నవ్ కదా? మిత్తీతో సహా చెల్లిస్తానని…
Ponnam Prabhakar : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల…
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుగా లేకపోయినా, గత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. Read…
Sridhar Babu: కరీంనగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియ వంటి కీలక అంశాలపై స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి? అంటూ ప్రశ్నించిన మంత్రి, త్వరలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. బీజేపీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ…
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగబోతున్న ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకుని వర్కౌట్ చేస్తోంది బీజేపీ. రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా...షెడ్యూల్ రాక ముందే తమ అభ్యర్థులను ప్రకటించి అప్పట్నుంచి దూకుడుగానే ఉంది. అంగబలం, అర్థ బలం ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటించి.. సాధారణ ఎన్నికల స్థాయిలో మేటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు కాషాయ నేతలు. ఈ ఎన్నికల ఓటర్లంతా చదువుకున్నవారు కావడం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో... ఎట్టి పరిస్థితుల్లో సత్తా…
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది.. వరసగా కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది.. ఓటమిలో రికార్డు సృష్టిస్తుందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. "హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యాచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీని ఆదరించాలి.
Kishan Reddy : యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్…
MLC Elections: వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు బిజెపి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు పట్టిన…