పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆయా పార్టీల కుట్రలను తిప్పికొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే యువజన కాంగ్రెస్ నేతలు కీలకం అని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా యువకుడు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారని అన్నారు.
Also Read:Se*xual Harassment: పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. వివాహిత సూసైడ్
పీసీసీ కార్యవర్గంలో,కార్పొరేషన్ పదవులలో యువజన కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వాలని కోరారు. యువజన కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి, ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పదవులు తీసుకోవడమే కాదు పని చేయాలని సూచించారు. అహంకారం ఉండొద్దని పార్టీ శ్రేయస్సుకోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈరోజు నుంచి ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. దేశంలో అత్యున్నత యూత్ కాంగ్రెస్ గా తెలంగాణ యూత్ ఎదగాలని మధుయాష్కీ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.