MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు అందరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 27వ తేదీన రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగనున్నాయి.. గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యత గురించి వివరించాలన్నారు. అలాగే, కూటమి నేతలు కూడా ఎక్కడికక్కడ మీటింగ్ లు పెట్టాలి అని సీఎం సూచించారు.
Read Also: Anurag Thakur: రాహుల్ గారు ‘సున్నా’ని చెక్ చేయండి.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పరువుతీసిన బీజేపీ..
దీంతో పాటు తెలుగు దేశం పార్టీ బూత్ స్థాయి, క్లస్టర్ స్థాయిలో కూటమి నేతలతో కలిసి మీటింగ్ పెట్టాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తసుకుని పని చేయాలని సూచించారు. కూటమి నేతలు కూడా సమన్వయం చేసుకుని మీటింగ్స్ పెట్టాలని తెలిపారు. ఈ ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రాబు.