TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పై చర్చకు సిద్ధం అని ఆయన అన్నారు. బీసీ కులగణన , ఎస్సీ వర్గకరణ చర్చకు ఎక్కడికి రమన్నా వస్తామని, సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కి లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్.
Minister Kollu Ravindra: మద్యం ధరల పెంపుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..
మీ నాయిన, మీ బావ, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు గుండు సున్నాతో బుద్ధి చెప్పిన విషయం మరిచావా? అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గాడిద గుడ్డు వస్తదని తెలిసే.. మీ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదని, బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్, మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తోందన్నారు. మూడు ముక్కలుగా చీలిన బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించదని ఆయన జోస్యం చెప్పారు.
High Court: భర్త, సహోద్యోగి మధ్య స్నేహం ‘‘వివాహేతర సంబంధమేనా’’..? భార్య ఆరోపణలపై హైకోర్ట్..