టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల 15న నిర్వహించాలనుకున్నా.. కొన్ని కారణాలతో దానిని 29వ తేదీకి వాయిదా వేశారు.. తెలంగాణ దీక్షాదివస్ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, మరోసారి ఈ…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాల విడుదలకానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే…
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి? తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు……
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది.…