Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
BJP Celebrations: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు నేడు (ఆదివారం) ఘనంగా జరిగాయి. గతంలో సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ కార్యకర్తలు బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి డా. లక్ష్మణ్ ప్రసంగించారు. Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.…
Anji Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. గురువారం అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా విలువైన పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరుఫున పోరాటం చేసేందుకు అవకాశం కల్పించండని ఆయన కోరారు. ప్రభుత్వం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది.
Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతం…
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ వచ్చేసింది.. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు..