తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు..
ఎమ్మెల్సీ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా ? మండలిలో ఖాళీ అవ్వబోతున్న సీట్లకు డిమాండ్ పెరిగిందా ? కొందరు కేబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నారా ? మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు...ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడిన, సీట్లు త్యాగం చేసిన వారికి...పార్టీ గుర్తింపు ఇస్తుందా ? రేసులో ఉన్న నేతలు ఎవరు ?
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీల ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు..ఎవరి వ్యూహాలో వారి మునిగిపోయారు. మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ? గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటుందా ? కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది. 2019 మార్చిలో జరిగిన…
ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై బిజెపి కసరత్తు ప్రారంభించిందా ? టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతిని ప్రతిపాదించడం ఖాయమేనా ? ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిని రంగంలోకి దించడం వెనుక ఆర్థికబలం, అంగబలం కారణమా ? కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతకు టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా ? తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది. త్వరలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై…