కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు జాబ్ క్యాలెండర్ అమలు చేసే చిత్తశుద్ధి లేదు.. శక్తి లేదని ఆరోపించారు. పీఆర్సీ ఎందుకు ప్రకటించడం లేదు.. 6 డీఏలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ రూ.8000 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇక గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థినులకు స్కూటీల సంగతి ఏమైంది? అని నిలదీశారు. అలాగే మహిళలకు ఇస్తామన్నా రూ.2,500 ఎక్కడా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: బిల్డర్స్‌కు హైదరాబాద్ స్వర్గధామం
‘‘రైతు భరోసా అరకొర చేశారు.. రైతు కూలీలకు 12 వేలు ఏమైంది..?, జీవో 317 మీద 50 వేల మంది భవిష్యత్ గందరగోళంగా మారింది.టీచర్స్ ఎన్నికల్లో ఉపాద్యాయ, అధ్యాపకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. దశాబ్దాలుగా ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాలున్న సరోత్తమ్ రెడ్డిని గెలిపించాలి. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
‘‘ఆర్‌ఆర్‌ఆర్‌కి రూ.26 వేల కోట్లు.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్.. మెగా టెక్స్ టైల్ పార్క్.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో యూరియా ఉత్పత్తి కోసం రూ.7 వేల కోట్లు, జాతీయ రహదారులను 32 జిల్లాలతో కేంద్రం అనుసంధానం చేసింది. కాంగ్రెస్ ప్రజలకి ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. కేంద్రం ఇచ్చిన పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శనం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారు. కేంద్ర సంస్థల నుంచే వేల కోట్లు రుణాలు ఇచ్చాం. వాటి ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Illegal Soil Mafia: కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా ఆగడాలు..