MLA Vasantha Krishna Prasad: వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్ధన్‌రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు.. నకిలీ మద్యంపై జోగి రమేష్ అనుచరుడే సమాచారం ఇచ్చారు.. జోగి రమేష్ అనుచరుడు సురేష్ ఎక్సైజ్‌శాఖకు తెలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. జోగి రమేష్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు…
జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు..
తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్‌పై ఎలాంటి కేసు లేదని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే నంబర్ రెగ్యులరైజ్ అయ్యిందని.. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమది కుడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి స్వయంగా అందించానని, ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. హైడ్రా…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమ.. కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను.. ఉమ పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అయితే, నా టార్గెట్ గా ఉమ పని చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతంలో నందిగామ ఎస్సీ రిజర్వు చేయటంతో మైలవరానికి వచ్చాను గుర్తుచేసుకున్నారు.. గత ఆరేళ్లుగా మైలవరం నుంచే పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ, నిద్ధిష్టమైన నిర్ణయం త్వరలోనే చెబుతాను అన్నారు.