Vasantha Krishna Prasad: వైసీపీలో సభ్యత్వం లేదు.. అటువంటి విధానమే నాకు తెలీదు..!
- వైసీపీలో సభ్యత్వం లేదు..
- అటువంటి విధానమే నాకు తెలీదు..
- వైసీపీపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: వైసీపీలో సభ్యత్వం లేదు.. అటువంటి విధానమే నాకు తెలీదు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.. ఈ సందర్భంగా లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు.. గొల్లపూడి మెయిన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సభ్యత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా శాశ్వత సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉంది అన్నారు.. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ అవసరం అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను అని పిలుపునిచ్చారు.. వైసీపీలో సభ్యత్వం అనేది గతంలో లేదు, నేను తీసుకోలేదు, అటువంటి విధానమే నాకు తెలీదు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలోనే సభ్యత్వం తీసుకోవడం జరిగిందని తెలిపారు.. కాగా, గతంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వసంత కృష్ణ ప్రసాద్.. ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. మరోసారి మైలవరం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన విషయం విదితమే.
Read Also: TDP: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం.. తొలి సభ్యత్వం తీసుకున్న చంద్రబాబు..
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?