మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్.
మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
Off The Record: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు. గతంలో సొంత పార్టీ నేతల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద… సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆరున్నొక్క రాగాన్ని ఆలపించిన వసంత…సీఎం జగన్‌తో భేటీ తర్వాత కాస్త మెత్తబడ్డారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన తాజా చర్య తిరిగి కలకలం రేపుతోందట. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దాన్ని కట్టడి చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఇతర…
Vasantha Krishna Prasad: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై అనేక ప్రచారాలు జరుగుతూ వచ్చాయి.. ఆయనకు, మంత్రి జోగి రమేష్ మధ్య వివాదాలతో.. ఎమ్మెల్యే వసంత వైసీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.. అయితే, మైలవరం పంచాయతీ విషయంలో రంగంలోకి దిగిన సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చర్చలు జరిపారు.. ఈ చర్చలు సఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన…
Off The Record:ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో సెగలు కక్కుతోంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ సొంత ఊరు మైలవరం నియోజకవర్గంలో ఉంది. 2014లో జోగి మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ నందిగామలో పోటీ చేసి గెలిచారు. ఇద్దరూ అధికారపార్టీ…