Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
- సుమారు 1 కోటి గుడ్లుపై యుద్ధం ఎఫెక్ట్
- మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయిన సరఫరా
- రూ.4.30 పడిపోయిన ఒక గుడ్డు ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namakkal Egg Exports: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో, నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయింది.
READ ALSO: Reusing Cooking Oil: మరిగిన నూనెను తిరిగి ఉపయోగిస్తున్నారా..? సురక్షితంగా ఇలా వాడండి..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
పడిపోయిన ధరలు.. కుదేలైన రైతులు
ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా సుమారు 1 కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ సెంటర్లలోనే ఉండిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గుడ్డు ధరను రూ.4.30 గా నిర్ణయించినప్పటికీ, నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు రూ.3.50 కే విక్రయించాల్సి వస్తోంది. ఒక గుడ్డు ఉత్పత్తికి రైతుకు రూ.4.50 ఖర్చవుతుండగా, అమ్మకపు ధర అంతకంటే తక్కువగా ఉండటం కోళ్ల ఫారాల యజమానులను అప్పుల ఊబిలోకి నెడుతోంది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నామక్కల్ ఎగుమతిదారులు కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాన్ని (Safe Passage) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం ప్రభావం కేవలం గుడ్లపైనే కాకుండా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కూడా పడింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది.
READ ALSO: Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!