రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికి బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళ పరిచి వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. వారికి అర్థమయ్యే విధంగా మరొక్కసారి వివరాలన్ని తెలియజేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు అని, వీరిలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉండి, తెలంగాణలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని…
Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
Tummala Nageswara Rao: హరీష్ రావు ఆరోపణలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీరు పెట్టుకున్నారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఎప్పుడూ అభివృద్ధి కోసమే పని చేశాను..
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. చేనేత రంగంలో నిపుణులైన మన చేనేత కార్మికుల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి…
రెండో విడత పంట రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.
తెలంగాణలో రైతులకు రుణమాఫీ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయనుంది. మొదటగా లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ అయింది. ఈ క్రమంలో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు.. సమస్యను…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.