పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్ కార్డు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసింది.
రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే 2024 లో కూడా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అప్పుడు 2018 రుణ మాఫీ క్రింద 20 వేల కోట్లు ప్రకటించి , 2023 ఎన్నికల సంవత్సరలో 13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో 1400 కోట్లు వెనక్కి వచ్చిన కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకుల ముందుకి వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు.…
బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు ఒక రైతుపొలంలో ప్లెక్సీలు కట్టడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.
Tummala: ఖరీఫ్ 2024లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షలలో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయశాఖ అంచనా వేయగా, దానికి సరిపడా BGII పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.