Minister Tummala: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు.
Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సమస్యలపై సీసీఐ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు.
ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిల్లగూడెం లో రోడ్లు, డ్రైనేజ్ లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… కమీషనర్ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ పాత పద్ధతిలో కాకుండా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టండి అని కోరారు. నిర్మాణం చేసేప్పుడు కార్పొరేటర్లు, డివిజన్ పెద్దలు వాటి నిర్మాణంలో నాణ్యత లేకపోతే కమీషనర్ కు సమాచారం ఇవ్వండని సూచించారు. Also Read:Buggamatham…
చేనేత కార్మికులకు మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "మీకు నష్టం జరిగే ఏ పని చేయదు. నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు కుల…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు.
పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల స్పందించారు. ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. నువ్వెక్కడ పోయావని అడిగినా ప్రశ్నకు... తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు. కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు – షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం. హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్…
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు.