Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 27 02 2026

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 27, 2026 , 5:14 pm
By Gogikar Sai Krishna
  • ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..
  • వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..
  • ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..
  • సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి బస్తీ బాట
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్.. స్పందించిన కవిత.. కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితకు క్లీన్ చీట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్. అరవింద్ కేజ్రీవాల్‌, సిసోడియాతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. లిక్కర్ కేసులో ఐదు నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు.

రింకూ సింగ్ జీవితంలో ఆ నాలుగు రోజులు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెను పరీక్ష!

టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్‌ తండ్రి ఖచంద్ర సింగ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలే ఖచంద్ర ఆరోగ్యం విషమించడంతో నొయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ కారణంగా జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్‌కు ముందు రింకూ జట్టును వీడాడు. దాంతో అతడు బిగ్ మ్యాచ్ మిస్ అయ్యాడు. రింకూ జీవితంలో వరుసగా నాలుగు రోజుల్లో జరిగిన సంఘటనలు అతడిని తీవ్రంగా కలచివేశాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకేసారి ఎదురైన పరిస్థితులు భావోద్వేగపూరిత పరీక్షగా మారాయి.

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు. బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌కు తరలించారు. నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ.. సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందటున్నారు వైద్యులు. బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న విషయం తెలియగానే కార్యకర్తలు, వైసీపీ లీడర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బొత్స త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం..

భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వంటి దర్శకులతో కలిసి భారీ విజయాలను అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమైంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కీలక అడుగు వేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘సినిమా అనేది సరిహద్దులు లేని ఒక అనుభూతి. భారత్ నుంచి ప్రపంచానికి మన కథలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగాన్ని ప్రారంభిస్తోంది’ అని సోషల్ మీడియా వేదికగా వారు పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు విదేశాల్లో మరింత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో ‘కాంతార’, ‘సలార్ 2’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా రావడంతో, ఈ సినిమాల వసూళ్లు ఓవర్సీస్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం తమ సినిమాలే కాకుండా, ఇతర భాషల చిత్రాలను కూడా గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో హోంబలే ఫిల్మ్స్ కేవలం ప్రొడక్షన్ హౌస్‌గానే కాకుండా, ఒక గ్లోబల్ మీడియా పవర్‌హౌస్‌గా అవతరించబోతోంది.

అవి అసలు విజయాలా, భారత్‌కు సెమీస్ చేరే అర్హత లేదు.. షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీగ్, సూపర్-8లో టీమిండియా సాధించిన విజయాలు.. అసలు విజయాలేనా అని విమర్శించాడు. చిన్న జట్లపైనే టీమిండియా ప్రతాపం చూపిస్తుందని, పెద్ద జట్లపై తేలిపోతుందని ఎద్దవా చేశాడు. వరల్డ్‌ కప్‌ 2026లో భారత్‌కు సెమీస్ చేరే అర్హత లేదన్నాడు. టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేసిందని, సెమీఫైనల్ చేరేందుకు కరేబియన్లకే 100 శాతం అర్హత ఉందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు మూడినట్లే..

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ స్వ్కాడ్’’లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్‌లను ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు పేలుడు దుస్తులు, కార్ బాంబులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, పాక్టియా, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ – పాకిస్తాన్ సరిహద్దు, వివిధ ప్రాంతాలలో తీవ్రమైన దాడి, ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్‌ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ప్రభావం నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. అధికారుల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో నమోదైంది. మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రకంపనలు తక్కువ సమయమే ఉన్నప్పటికీ.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో పలువురు తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫర్నిచర్ కంపించాయని పోస్టులు పెట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ నెలలో భూకంపం కోల్‌కతా నగరాన్ని రెండోసారి వణికించింది. ఫిబ్రవరి 3న కూడా స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప కేంద్రం మయాన్మార్ లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రకంపనలు కూడా కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో అనుభూతి అయ్యాయి.

సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి బస్తీ బాట

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బస్తీ వాసులతో కలిసి గల్లీల్లో కలియ తిరిగారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బస్తీల్లో జనాభా వేగంగా పెరుగుతోందని, ప్రతిరోజూ కొత్త కాలనీలు, కొత్త అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి నగర స్వరూపమే మారిపోతోందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అలాగే బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడానికి ఈ అక్రమ కేసును సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితమని ఆయన స్పష్టం చేశారు.

వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..

ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఒక పెళ్లి యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు, 22 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 48 ఏళ్ల గ్యాప్ ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వరుడిని 70 ఏళ్ల హకీమ్ బాబర్‌గా గుర్తించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు ఫోటో షూట్ కూడా చేసుకున్నారు. ఒక క్లిప్‌లో వధువు ‘‘ఏక్ థా టైగర్’’ మూవీలోని దిల్ దియాన్ గల్లన్ పాట పాడుతుండగా, వృద్ధ వరుడు కూడా పాడతటం ప్రారంభించాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • delhi liquor scam
  • Kavitha
  • Rinku Singh

తాజావార్తలు

  • Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

  • Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్‌ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్

  • Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్

  • AP Weather Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • Jeevan Reddy : మంత్రులతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా జీవన్ రెడ్డి సంకేతాలు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions