రెండో విడత పంట రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నుంచి అందిన సమాచారం మేరకు.. 11.32 లక్షల కుటుంబాలకు 6014 కోట్ల రూపాయలు జమ కావడం జరిగిందని, కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కాలేదన్నారు.
Read Also: Minister Anagani Satya Prasad : మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన కోసమే..!?
ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం.. అట్టి రైతుల ఖాతాలలో పేర్కొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి, ఆర్బీఐ నుండి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన కొన్ని రుణఖాతాల (15,781) తనిఖీ నేటితో పూర్తవుతుందని, పూర్తయిన వెంటనే ఆ ఖాతాలకు కూడా రుణమాఫీ నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?