Tummala Nageswara Rao: హరీష్ రావు ఆరోపణలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీరు పెట్టుకున్నారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఎప్పుడూ అభివృద్ధి కోసమే పని చేశానని, ప్రకటనల కోసము అడ్వర్టైజ్మెంట్ ల కోసం, రాజకీయాల కోసం పనిచేయననీ తాను ఎప్పుడూ నిరంతరం రైతుల కోసం పనిచేస్తానని చెప్పాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినా ఏ నాయకుడు మంచి పనులు చేసిన వారి పనులని ముందుకు పోయే విధంగా చేశాను అని మాత్రమే అన్నారు . సీతారామ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే సందర్భంలో మీరు వస్తే మేము మీపై కూడా నీళ్లు చల్లుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నాడు. తాను అభిమానించే నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అంటున్నారు. నేను అభిమానించే వ్యక్తులు, రాజకీయ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి కూడా నా మీద మాట్లాడిన తీరు బాధాకరం అన్నారు. మీరు పూర్తి చేసి ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోలేదన్నారు. కొంతమంది స్థానిక పెద్దలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పది నియోజకవర్గాలకు నీళ్లు వెళ్ళాలన్నారు. పార్టీల పరంగా అభివృద్ధి పథకాలు నేను చేయనని తెలిపారు.
Read also: ACB Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు..
నా ఫస్ట్ ప్రయారిటీ.. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం దేశం చూస్తానని తెలిపారు. చప్పట్ల కోసం, మీ కీర్తి కోసం నేను పని చేయనని అన్నారు. ఏ రాజకీయ నాయకుడి నీ కూడా పల్లెత్తు మాట అనను.. జలగం వెంగళా రావు ను ఆనాడు విమర్శించలేదు… త్యాగం చేసిన మహానుభావుల పథకాలు పూర్తి చేశానని తెలిపారు. లపంగి రాజకీయాలు నేను చేయనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదు అని నేను అనలేదు ఆనాటి ప్రభుత్వం సాంక్షన్ చేసింది… కేవలం మోటార్ లు పనిచేయాలని కోరిక మాత్రమే నాదన్నారు. నన్ను వ్యతిరేకించే వారికి, అవమాన పరిచే వ్యక్తులకు నా గురించి తెలుసు… ఎవ్వరిని దేహి అని నేను అడిగాను.. టికెట్ అడుగలేదు.. ఎవ్వరిని డబ్బులు అడుగలేదు. ఓడిన రోజున నేను ఇంటికి పోయి వ్యవసాయం చేసుకున్నాను.. కుహనా విమర్శలకు చిల్లర విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం పై ఆరు నెలలకే అడిపోసుకోవడం మీకే తగులుతుందన్నారు. మీ నిర్వహకం, మీ అవినీతి వల్ల నే వ్యవస్థ దెబ్బతిన్నదని, మీరు చేసిన నిర్వాకం వల్ల నే హాస్టల్ లో దారుణంగా వుందన్నారు.
Manu Bhaker-Neeraj Chopra: మను బాకర్ ఇంకా చిన్నపిల్ల.. పెళ్లి వయసు రాలేదు: మను తండ్రి