హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం కానున్నారు.
READ MORE: US B-2 Bombers: ఇండో-పసిఫిక్‌లో మోహరించిన అమెరికా B-2 బాంబర్ విమానాలు
కాగా.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై శుక్రవారం సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఏస్ ,రెవెన్యూ ,జీహెచ్ఎంసీ,అటవీ ,హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నివేదిక తయారీపై సీఎస్ ఫోకస్ పెట్టారు. కంచ గచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన చేస్తోంది.
READ MORE:AP Deputy CM: నేడు భద్రాచలం వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్