Smart Ration Cards: నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ..
- నాలుగు విడతల్లో రేషన్ కార్డుల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రేషన్ కార్డులను స్మార్ట్‌గా మార్చేసింది.. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
మొత్తంగా నాలుగు విడతల్లో 1 కోటి 45 లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.. మొదటి విడతలో అంటే నేటి నుంచి 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణ చేయనున్నారు.. ఇక, రెండో విడతలో అంటే ఈ నెల 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఇవి అందించనున్నారు.. మూడో విడత వచ్చే నెల 6వ తేదీ నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.. నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాలు – బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం ఉంటుంది.. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.. ఈకార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొంటారు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!