Minister Nadendla Manohar: కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.. కూటమి ఏడాది పాలన పై NTVతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కొన్ని ఛాలెంజెస్ పాలనలో ఉన్నాయి.. గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసి అర్చక పాలన చేశారు.. గాడితప్పిన వ్యవస్థను సెట్ చేస్తూ.. ప్రజల కోసం అంకితభావంతో పనిచేయడానికి కొంత సమయం పడుతుందన్నారు.. ఆర్థికంగా రాష్ట్రం చాలా దెబ్బతింది. ఎప్పుడూ లేనివిధంగా అప్పులు, ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.. ఇవి అన్ని అధిగమించి సంక్షేమం చేస్తున్నాం.. ఇప్పుడు జాగ్రత్తగా, పద్ధతిగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని కలిపి ముందుకు వెళ్తున్నాం. టీమ్ వర్క్‌తో సవాళ్ల మధ్య కూడా స్మూత్ గవర్నెన్స్ కొనసాగుతోందని తెలిపారు.
Read Also: Operation Sankalp: MAAతో కలిసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఆపరేషన్ సంకల్ప్’
అమరావతి, పోలవరం వంటి కీలక అంశాలపై దృష్టి సారించి అభివృద్ధిని కొనసాగిస్తున్నాం అన్నారు మంత్రి నాదెండ్ల.. సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మేం సవాల్ చేస్తున్నాం.. డిబేట్‌కు రెడీ.. ప్రభుత్వం పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి సంక్షేమాన్ని ప్రజలకు చేర్చుతున్నాం. వైసీపీ పాలన విచిత్రంగా, అనుభవం లేక, స్వలాభం కోసం వ్యవస్థను దుర్వినియోగం చేశారు. సంక్షేమం పేరుతో ప్రలోభాలు పలికారు.. పరిపాలనపై ఏనాడూ దృష్టి పెట్టలేదు.. వ్యవస్థకు అపార నష్టం కలిగింది.. కేంద్రం నుంచి 100 శాతం సహకారం అందుతోంది. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ అండగా కేంద్రం నిలబడుతుంది.. ప్రజలకు పథకాలు సరిగ్గా అందించామని గుర్తించి కేంద్రం సహకరిస్తోందన్నారు.
Read Also: Donald Trump: “రేర్ ఎర్త్ మెటీరియల్స్”పై చైనాతో డీల్ పూర్తయింది..
పోలవరం, అమరావతి పైన కేంద్ర మద్దతు స్పష్టంగా ఉంది.. రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్రం సహాయం చేస్తోందన్నారు నాదెండ్ల మనోహర్.. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమి పాలనలో సమన్వయానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించాం. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుంది. మొదటి ఏడాది పాలనపై స్పష్టమైన దృష్టితో ముందుకెళ్లాం. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తాం. కమిటీలను ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం. కొత్త తరానికి రాజకీయాల్లోకి జనసేన తీసుకొస్తోంది. యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి, పాలిటిక్స్‌లో పెనుమార్పులు తేవడమే లక్ష్యం అన్నారు.. ప్రజలకు మేలు చేసే విషయంలో బలమైన విశ్వాసంతో ముందుకు సాగుతాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి అద్భుత నాయకత్వం కూటమికి ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..