ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనేపథ్యంలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 11, 12 మంది మా నాయకుల మీద ఈడి, సీబీఐ, ఐటీ దాడులు కేంద్రం చేయిస్తుందని మండిపడ్డారు.
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
నేడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి మంత్రి కేటీఆర్ హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చేరుకుంటారు.
మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర CII వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.