మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకరరావు అత్యుత్తమ మంత్రి అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకే రావడం గర్వకారణమన్నారు. మాతో పాటే అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసింది..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘ప్రధాని మోదీ అదానికి దోచి పెడుతున్నారు. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. \
Also Read : Car Falls Into Gorge: లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మరో ఘటనలో ఐదుగురు
మతపరమైన మంటలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు… పిరమైన ప్రధాని. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు. 1550 కోట్ల రూపాయలను మహిళా రుణాలను ఇవాళ ఇస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే మన రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయి. నాడు గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంది…ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి.
Also Read : Jasprit Bumrah: న్యూజిలాండ్‌లో బుమ్రా సర్జరీ విజయవంతం.. క్రికెట్ రీఎంట్రీ అప్పుడే..
65 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేయలేని పనులు ఇప్పుడు చేస్తున్నాం. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు ప్రకటించిన కేటీఆర్. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఎర్రబెల్లి దయాకర్ రావును కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. వచ్చే ఎన్నికల్లో మా సిరిసిల్ల కంటే పాలకుర్తిలో దయాకర్ రావును ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.