MLC Elections: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాల ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీతోపాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
శాసనమండలిలో గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణా రెడ్డి పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. వీరి కోటాలో ఎన్నికలకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది.ఈ స్థానాలకు గురువారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.ఈ నెల 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇవాల మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించి ఆమోదం పొందనున్నారు. ఇదే సమావేశంలో కేబినెట్ సిఫారసు మేరకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలు, అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించే అవకాశం ఉంది.
BRS in Vanaparthi: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. జెడ్పీ ఛైర్మన్ సహా కీలక నేతల రాజీనామా!