Minister KTR Talks About Women Journalists: ప్రభుత్వం చేసే మంచి పనుల్ని చూపెట్టండి, అలాగే తప్పు చేస్తే చీల్చి చెండాడండి అని మంత్రి కేటీఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఉద్యోగం థాంక్స్‌లెస్ జాబ్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2018 మార్చి 8వ తేదీన వీ-హబ్ ఏర్పాటు చేశామని, ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. మహిళా జర్నలిస్టుల కోసం కొత్త కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని అన్నారు. జర్నలిజంలో వస్తున్న కొత్త పోకడలను యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని.. ఇది రెండు రోజుల వరకు సాగే కార్యక్రమమని తెలిపారు.
Women Journalists: మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. హాజరైన మంత్రులు
కల్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని, కేసీఆర్ కిట్ కారణంగా సురక్షిత ప్రసవాలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. అలాంటి మంచి విషయాల గురించి టీవీల్లో చూపెట్టమని చెప్పిన ఆయన.. ఒకవేళ తాము తప్పు చేస్తే చీల్చి చెండాడండి అని చెప్పారు. మహిళలపై దాడులు జరిగినప్పుడు.. ఏ ఒక్కరూ స్పందించకుండా ఉండరని వివరణ ఇచ్చారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. ప్రతిఒక్కరూ ప్రభుత్వాన్నే నిందిస్తారన్నారు. రాత్రికి రాత్రి అన్ని జరగవని.. ప్రభుత్వంలో ఉన్న వారికి మనసు ఉండదని అనుకోవద్దని కోరారు. మహిళల్ని గౌరవించాలని చిన్నతనం నుంచే నేర్పించాలని సూచించారు. జెండర్ సెన్సివిటి కరిక్యులమ్‌లో ఉండాలని, దానికి ప్రయత్నాలు జరగాలని పేర్కొన్నారు. మహిళలపై దాడుల నివారణ పట్ల చైతన్యం ఉండాలన్నారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలోని 19 వేల మందికి అక్రిడిటేషన్ గుర్తింపు ఉంటే.. గుజరాత్‌లో కేవలం 3 వేల మందికి మాత్రమే గుర్తింపు ఉందని చెప్పుకొచ్చారు.
Kishan Reddy: మోడీని విమర్శించండి కానీ ప్రాజెక్టులను అడ్డుకోకండి.. కేసీఆర్‌కు విజ్ఞప్తి