Bio Asia : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి.
Minister KTR: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. మంత్రులు చెప్పే మాటలు అబద్ధాలంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.