మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.
మాఫియాను నడిపినట్లుగా మీడియాను నడుపుతున్నారన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌరవం ఉందని కేటీఆర్ అన్నారు.