రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్ లీక్ విషయంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.
ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు.
Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.