నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతుంది.. అందులో ఎంతటి వారున్నా వదిలి పెట్టే సమస్య లేదన్నారు. అలాగే, మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం.. బార్ కోడ్ స్కానింగ్ పెట్టిన తరువాత నకిలీ బాటిల్స్ బయట పడలేదని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Minister kollu Ravindra: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనపై సెటైర్లు వేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్న ఆయన.. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుండి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని దుయ్యబట్టారు.. పొలం గట్ల మీద నడిచి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు.. తుఫాన్…
కల్తీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో గతంలో ప్రజాప్రతినిధులా, ఇప్పుడు వారే రౌడీలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?.. ప్రతీదీ కౌంట్ అవుతుంది, చట్టాలున్నాయి అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి అన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు తన మీద మాట్లాడుతున్నారని.. తన వాళ్లని నేను కంట్రోల్ చేస్తున్నా అని, వదిలితే తమ వాళ్లు చాలా…
Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. ఈ కేసులోని పరిణామాలపై స్పందించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఒక నివేదిక ఇచ్చింది.. నకిలీ మద్యం తయారీకి సంబంధించి సమాచారం వచ్చింది. నకిలీ మద్యం సఫ్లయ్ చేసే వ్యాన్ లు కూడా ఐడెంటిపై చేసాం.. సంబంధిత అధికారులు దాడులు చేశారు. 30…
Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు.
సాక్షాత్తు జగనే వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు.. చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించారు. అధికారంలో ఉండగా మాపై జగన్ పెట్టించినవి అక్రమ కేసులని నిరూపించుకోలేదా?.. కేసులపై ఇప్పుడెందుకు నీతి కబుర్లు చెబుతున్నారు? అని అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు.. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Minister Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు.
గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావెరి సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.. ఈ సమావేంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశాం.. కానీ, 2019-…
లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు..