Minister Kollu Ravindra: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ లో దోచుకున్నారు.. గత ప్రభుత్వంలో మైనింగ్ పై ఆధారపడిన వాళ్లకి ప్రతిరోజు దినదిన గండంగా గడిచింది.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ముందుకు వెళ్తున్నాం.. వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న మైన్స్ ని తిరిగి ప్రారంభించాం.. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం.. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నాం.. విశాఖలో జరిగిన సమ్మిట్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.. గత ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడిదారులను తరిమేశారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు తిరిగి నమ్మకం కలిగించారు.. ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: Winter Bathing: చలికాలంలో రోజూ స్నానం చేస్తే ఆయుష్షు తగ్గుతుందా..? ఈ వాదనలో నిజమెంత..?
అయితే, వచ్చిన పెట్టుబడులతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గనుల సీవరేజీ పాలసీని గత ప్రభుత్వంలో తీసుకువచ్చారు.. దాన్ని సరళీకృతం చేస్తామన్నారు. ఇక, నకిలీ మద్యం వ్యవహారం దురదృష్టకరం.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చెయ్యాలనే దురుద్దేశంతో నకిలీ మద్యం తయారు చేశారు.. మద్యంతో గతంలో వాళ్ళు చేసిన స్కాం బయటకి తీస్తున్నాం.. కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరుగుతున్నాయి.. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతుంది.. అందులో ఎంతటి వారున్నా వదిలి పెట్టే సమస్య లేదన్నారు. అలాగే, మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం.. బార్ కోడ్ స్కానింగ్ పెట్టిన తరువాత నకిలీ బాటిల్స్ బయట పడలేదని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.