Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.. ఈ రోజు, రేపు కల్లుగీత కార్మికులతో కృతజ్ఞత సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 11వ తేదీన చేనేత కార్మికుల ఆధ్వర్యంలో 100 అడుగుల వస్త్రాలతో ర్యాలీలు తీస్తాం.. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నేపథ్యంలో షాపుల అలంకరణ కార్యక్రమం చేపడుతాం.. లబ్ధిదారుల కుటుంబాలను ఆహ్వానించి కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన మేలుపై వివరిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Read Also: HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?
అయితే, గత ప్రభుత్వం బీసీలను బ్యాక్ బోన్ అంటూనే వారి వెన్ను విరిచింది అని మంత్రి రవీంద్ర విమర్శించారు. బీసీలకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చింది టీడీపీనే.. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించిన చరిత్ర వైసీపీది.. బీసీల సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేసి బీసీల బతుకులను జగన్ చిద్రం చేశారు.. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీసీల నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి.. బీసీలకు కూటమి ప్రభుత్వం చేసిన మేలును ప్రతి బీసీ కుటుంబానికి తెలియజేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.