ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్‌లు విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు..
అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు.
మ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించిన ఆయన.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల ను వక్రీకరించారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెబుతూ.. ఇప్పటికే ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు.. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.