ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పత్రికలు, పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరుతున్నానని.. ఏ ఒక్కరికీ భారం పడకూడదని, ఇబ్బంది పడకూడదనే సంస్కరణలు తెస్తున్నామని స్పష్టం చేసారు. భాజపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు..మీరు మాకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భాజపా నేతలు వచ్చి మాకు సుద్దులు చెప్పడం తప్పు అని ఫైర్ అయ్యారు. పన్ను విధింపులో ఇప్పటివరకు ఉన్న లోపభూయిష్ట విధానం ఉండగా…
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్‌మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.. సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు…