Botsa Satyanarayana: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.. జగన్ అన్నీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వెల్లడించారు. ఇక, ప్రశాంత్ కిషోర్ ని బీహార్ నుండి తరిమికొట్టారు.. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు విజన్ ఎప్పుడు అమరావతిని ఎలా దోచుకోవాలి, తన సామాజిక వర్గానికి భూములని ఎలా కట్టబెట్టాలి అనేది అని ఆరోపించారు బొత్స.. చంద్రబాబు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచన చెయ్యనే లేదన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలకి ఎలా మంచి చేయాలనే ఆలోచన చేస్తాడని తెలిపారు. చంద్రబాబుకి ప్రశాంత్ కిషోర్ సన్నాయి నొక్కు నొక్కుతున్నాడు.. ప్రశాంత్ కిషోర్ మా దగ్గర 5 సంవత్సరాలు వున్నావు కదా..? నీ ఆలోచనలు ఎలా వుంటాయో మేం చూశామని కౌంటర్ ఇచ్చారు.
ఇక, పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే , ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అని మండిపడ్డారు బొత్స.. మరోవైపు.. పవన్ కల్యాణ్ మాటమీద నిలబడేతత్వం లేని మనిషి అని ఎద్దేవా చేశారు.. ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట మాట్లాడతాడు.. ఆయన కోసం మాట్లాడటం టైం వేస్ట్ అన్నారు. మరోవైపు.. వైఎస్ షర్మిల కడుపులో ఏ బాధ వుందో, నాకేమి తెలుసు.. ఆమెపై నో కామెంట్స్ అంటూ దాటవేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంకా బొత్స మీడియా సమావేశంలో ఏం మట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..