Botsa Satyanarayana: కూటమికి సమాజ శ్రేయస్సు కంటే సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ అంటూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై ఆరోపణలు చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.. చంద్రబాబు అంటే స్వార్థం, సొంతం తప్ప మరొకటి వుండదు.. మిగిలిన ది అంతా సొల్లే అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మేం వ్యతిరేకం.. తమ వైఖరి ఏంటో చెప్పకుండా కూటమి అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గాల్లో తిరగడానికి ఆస్కారం వుండ కూడదన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన గంటా పదవిని నిలబెట్టుకోవడానికి కోర్టుకు ఎందుకు వెళ్లారు..? త్యాగం చేసినట్టు గొప్పలు చెప్పుకుని ఎవరిని మోసం చేయాలని మీ ఉద్దేశం..? అని ప్రశ్నించారు. సివిల్ సర్వీసు అధికారులను విధుల నుంచి తప్పించాలని లేఖలు రాస్తున్నారు.. వాళ్లంతా మీ ప్రభుత్వంలో పనిచేయలేదా..? IAS, IPS లను తొలగించి ఆ స్థానంలో హెరిటేజ్ మేనేజర్లను నియమించండి అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Sayaji Shinde Health: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజి షిండే!
జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించామని చెప్పడం తప్ప.. చంద్రబాబు స్పీచ్ లో ఎక్కడా తాను ఏమీ చేయగలుగుతామో చెప్పలేకపోతున్నారని సెటైర్లు వేశారు మంత్రి బొత్స.. మద్యం నిషేధం విధిస్తామని చెబితే బాగుంటుంది.. కానీ, ధరలు తగ్గిస్తామని చెప్పడం చూస్తే ఆడవాళ్లు చీపుర్లతో కొట్టేస్తారని హెచ్చరించారు. ఇక, ఈ రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందన్న ఆయన.. టీడీపీ టక్కు టమార విద్యలు తాతకి దగ్గలు నేర్పినట్టే అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూటమి ఒక ప్రకటన చేయాలి.. ప్రయివేటీకరణ ఆపలేరు కానీ వీళ్ళకు ఓట్లేయాలా..? స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు, ధర్నాలు చేసినట్టు బిల్డప్ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్నారని ఫైర్ అయ్యారు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు బీజెపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వ్యతిరేకించాం. మోడీ సభలోనే మా అభిప్రాయం చెప్పాం అన్నారు. సంక్షేమం పథకాలు ప్రజలకు అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే.. ఒక్కో వ్యక్తి తలసరి ఆదాయం లక్ష రూపాయలు పెరిగింది.. ఇదేదో మంత్రం వేస్తే జరిగేది కాదు ఒక ప్రణాళిక బద్ధంగా చేసిన ప్రయత్నం వల్ల ఫలితం వచ్చిందన్నారు.. ఓటు వేసే ప్రతీ వ్యక్తికి భరోసా మాది అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత క్రియాశీల కార్యకర్తలు విస్తృతంగా తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.