ఈ రోజు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు.
అంగన్వాడీల అంశంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లో కూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. దీనిపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని స్పష్టం చేశారు.. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నుంచి 3 వేల పెన్షన్ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారమని అన్నారు. మూడో తేదీన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని చెప్పారు. వచ్చేనెల 4 ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయని.. అంతేకాకుండా, వైయస్సార్ ఆసరా చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ నగదు జమ చేయమన్నారని అన్నారు. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్…
2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.