మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.
అయ్యా పవన్ కళ్యాణ్ ... ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి?.. బీజేపీతో ఉన్నట్లా? లేనట్లా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అనైతిక, విశ్వాస రహిత రాజకీయ.. బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే.. ఒక పెళ్ళి చేసుకుని మరొక ఆమెతో బంధం నడిపావు..
పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకోవడంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ "BRO" అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను పెట్టాడు.