Ambati Rambabu: బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలయ్య మీకు ఇదే సరైన సమయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ సభ్యులు రెండో రోజూ కూడా ఆందోళనకు దిగారు.. అయితే, టీడీపీ సభ్యులకు కౌంటర్‌గా సభలో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. నందమూరి బాలకృష్ణకు సలహా ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు అంబటి..
Read Also: India-Canada: కెనడాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. దెబ్బకు కంపెనీ క్లోజ్
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
అంతే కాదు.. మీ బావ (చంద్రబాబు) జైల్లో… అల్లుడు (లోకేష్) ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి.. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా.. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతావు అంటూ హెచ్చరించారు. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి.. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో.. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి అంటూ సవాల్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు మంత్రి అంబటి.. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారన్న ఆయన.. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని.. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!