టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని.. వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు.
గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్‌డ్‌గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు-పీకే భేటీపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడు.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా, ఎంతమంది పవన్ కల్యాణ్‌లు కట్ట కట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు.
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు.
పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు ఉంటాయని.. ఇది సహజమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీవీతో మంత్రి మాట్లాడారు. 175 గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. తాజాగా వచ్చిన సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు.
రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.