మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.
మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడిగా చెప్పుకుంటున్నారు.. కానీ.. ఇది ఎప్పడుు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకొచ్చారు.. ఏదో హాడావుడిగా పనులు చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
జనసేన - టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు.
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.