Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల గురించే కాదు.. అసలు నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎంపీలు కోటగిరి, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన ఆయన.. ప్రాజెక్టు పనులపై వివరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీయంగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం…
AP Three Capitals: మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. Read Also:…
Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో జాప్యం కొనసాగుతూనే ఉంది.. అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల ఇచ్చిన రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం…
Ambati Rambabu vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ కామెంట్ చేసినా.. వెంటనే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.. తాజాగా, మా నాన్న నాస్తికుడు అంటూ పవన్ చేసిన కామెంట్లపై కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. మా నాన్న నాస్తికుడు.. మా నాయనమ్మ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకుని దేవుడు…
Ambati Rambabu vs Nagababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ కూడా కాకరేపుతోంది.. పండుగ సమయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇక, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇదే తాజా మాటల యుద్ధానికి కారణమైంది.. ఆ…
Ambati Rambabu: యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.. నన్ను టార్గెట్ చేస్తే నేలకు కొట్టిన బంతిలా ఎగిరి పడతానన్న ఆయన.. జనసేన నాపై బురద చల్లడం ఇంతటితో ఆగదు.. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు.. అయినా నేను భయపడను, నేను…
సంక్రాంతి పండుగ నేపథ్యంలో లక్కీ డ్రా పేరుతో టికెట్లు విక్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు.. ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు విక్రయిస్తున్నారని.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయని అంటున్నారు.. అసలు ఈ టికెట్ల విక్రయానికి సచివాలయలు టికెట్స్ కౌంటర్లుగా మారిపోయాయని.. వాలెంటిర్ల…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు…