Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu bail: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు.
Read Also: Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే మరో కేసులో అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. గుంటూరు స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు పట్టాభిపురం పోలీసుల కస్టడీ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, చివరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో అంబటి రాంబాబుకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అంబటి రాంబాబకు బెయిల్ వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!